తెలంగాణలో అన్నదాతల మరణ మృదంగం

తెలంగాణలో అన్నదాతల మరణ మృదంగం

తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణలో అన్నదాతల మరణమృదంగం మోగుతోందన్నారు. రుణమాఫీ లేదు,పంటను కొనే నాథుడు లేడు,అమ్మిన పంట సొమ్ముల కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తోన్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొని ఉందని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇంటి ముందు అప్పులోడి లొల్లి చేస్తుంటే.. సమస్య పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి తీర్థయాత్రలు,రాజకీయ భేటీలతో బిజీగా ఉన్నాడని విమర్శించారు రేవంత్. ఈ ట్వీట్ కు ఆయన వెలుగు పత్రికలో రైతు ఆత్మహత్యలపై వచ్చిన కథనం కూడా ఆయన తన ట్వీట్ కు జత చేస్తూ పోస్టు చేశారు. వెలుగు దినపత్రికకు సంబంధించిన వార్త క్లిప్పింగ్స్ పెట్టారు. 

మరోవైపు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. పంట దిగుబడి రాక కొందరు.. కొనుగోళ్లు జరగక ఇంకొందరు.. యాసంగిలో వరి వద్దనడంతో మరికొందరు.. ఇట్ల గడిచిన రెండున్నర నెలల్లోనే రాష్ట్రంలో 206 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. పెద్ద దిక్కును కోల్పోయి ఆ అన్నదాతల కుటుంబాలు రోడ్డునపడుతున్నయి. నేషనల్​ క్రైమ్​ బ్యూరో ఆఫ్​ రికార్డ్స్​ లెక్కల ప్రకారం తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఏడేండ్లలో రాష్ట్రంలో  7,409 మంది రైతులు సూసైడ్​ చేసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రైతు సంఘాల అంచనా.