విదేశాలకు వెళ్లే వారికి బూస్టర్ డోసు

విదేశాలకు వెళ్లే వారికి బూస్టర్ డోసు
  • గడువుకన్నా ముందే బూస్టర్ డోసు

విదేశాలకు వెళ్లే భారతీయులకు బూస్టర్ డోసు విషయంలో కేంద్రం మార్గ దర్శకాలను సవరించింది. తాము వెళ్లాలనుకున్న దేశంలోని నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రికాషనరీ డోసు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ వెసులుబాటు కొవిన్ పోర్టల్ లో త్వరలోనే అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ చెప్పారు. 

ప్రస్తుతం మన దేశంలో రెండో డోసుకు, బూస్టర్ డోసుకు మధ్య కాల వ్యవధి తొమ్మిది నెలలుగా ఉంది. మిగతా ప్రజల విషయంలో మాత్రం నిబంధనలు ఎప్పటిలానే ఉన్నాయి. ఆశా కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, 60 ఏళ్లు పై బడిన వారికి ఈ ఏడాది జనవరి నుంచి బూస్టర్ డోసులు అందిస్తున్నారు. ఏప్రిల్ నుంచి 18 ఏళ్లు దాటిని వారికి కూడా ఈ డోసులు అందుబాటులో ఉంటున్నాయి. 

మరిన్ని వార్తల కోసం..

దళితులను మభ్య పెట్టేందుకే దళిత బంధు

ఒకటో తారీఖునే వేతనాలు ఇస్తున్నాం