నాగార్జున ఏం తింటున్నారో?: రామ్ గోపాల్ వర్మ

నాగార్జున ఏం తింటున్నారో?: రామ్ గోపాల్ వర్మ

హైదరాబాద్: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున శనివారంతో 61వ పడిలోకి ప్రవేశించారు. నాగ్‌ బర్త్‌ డే సందర్బంగా ఆయనకు విషెస్ చెబుతూ చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ట్వీట్స్, మెసేజెస్‌ చేశారు. మన్మథుడికి కాంట్రవర్షియల్ ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ కూడా శుభాకాంక్షలు తెలిపారు. నాగార్జున ఏం తింటున్నారని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ‘నాగార్జున మీరేం తింటున్నారో నాకు తెలియదు. మీరు ఏ దేవుడ్ని ప్రార్థిస్తారో కూడా నాకు తెలీదు. మీరేం చేస్తారో కానీ ప్రతి పుట్టినరోజుకి యంగ్‌గా, మరింత యవ్వనంగా కనిపిస్తున్నారు. మీరు ఇలాగే ఎప్పుడూ ఆనందంగా జీవించాలని కోరుతున్నా’ అంటూ నాగ్‌ను పొగుడుతూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. శివతో రామూకు నాగ్‌ తొలి సినిమా చాన్స్‌ ఇచ్చారు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.