2026 ఏప్రిల్ నెలలో అరుదైన గ్రహల మార్పు జరగబోతోంది. దీనినే జ్యోతిష్య భాషలో 'సూర్య శని మంగళ యుతి' అంటారు. మీన రాశిలోకి సూర్యుడు, శని, కుజుడు రావటాన్ని అరుదుగా చెబుతున్నారు పండితులు. సూర్యుడు ఆత్మవిశ్వాసానికి, కుజుడు ధైర్యానికి, శని క్రమశిక్షణకు సంకేతాలు. ఈ మూడు శక్తులు కలిసినప్పుడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన లాభం, పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఈ ప్రభావం బలంగా ఉంటుంది. ఈ అరుదైన కలయిక వల్ల నాలుగు రాశుల వాళ్లకు అదృష్టం వరిస్తుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆ నాలుగు రాశులు ఏంటో తెలుసుకుందాం..
1. మిథున రాశి
మిథున రాశి వారికి ఈ కాలంలో కెరీర్ పరంగా ఎంతో బాగుంటుంది. ఉద్యోగంలో మీరు తీసుకునే నిర్ణయాలు పై అధికారుల మెప్పు పొందుతాయి. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడి లాభాలు పెరుగుతాయి. కోర్టు గొడవలు లేదా ఆస్తి వివాదాలు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి.
2. కుంభ రాశి
కుంభ రాశికి అధిపతి శని కావడం వల్ల వీరికి ఈ గ్రహాల కలయిక బాగా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం పెరగడంతో పాటు, ఆఫీసులో పెద్ద బాధ్యతలు మీ భుజాన పడతాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఇది సరైన సమయం. పాత అప్పుల బాధల నుంచి విముక్తి లభించి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
3. వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఏదైనా కొత్త పని మొదలుపెట్టడానికి ఇది మంచి సమయం. శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యం అయినా, చివరికి విజయం మీదే అవుతుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలి అనుకునే వారికి ఈ గ్రహ స్థితి అనుకూలిస్తుంది. తెలివితేటలతో మీరు కఠినమైన సవాళ్లను కూడా సులభంగా అధిగమిస్తారు.
4. వృషభ రాశి
వృషభ రాశి వారికి ఆర్థికంగా ఎదుగుదల కనిపిస్తుంది. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. జీతం పెరుగుదల లేదా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఈ కాలంలో చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తాయి. జీవితంలో ఒక స్థిరత్వం ఏర్పడటానికి ఈ గ్రహాల కలయిక దోహదపడుతుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
