ప్రియుడికి బ్రేకప్ చెప్పిన 'దంగల్' బ్యూటీ.. అసలు కారణం ఇదేనా?

ప్రియుడికి బ్రేకప్ చెప్పిన 'దంగల్' బ్యూటీ..  అసలు కారణం ఇదేనా?

బాలీవుడ్ వెండితెరపై తనదైన ముద్ర వేసిన 'దంగల్' బ్యూటీ సన్యా మల్హోత్రా వ్యక్తిగత జీవితం ఇప్పుడు బీ-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాది కాలంగా ప్రముఖ సితార్ వాద్యకారుడు రిషబ్ రిఖిరామ్ శర్మతో ప్రేమాయణం సాగించింది ఈ ముద్దుగుమ్మ. అయితే లేటెస్ట్ గా తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎటువంటి హడావుడి లేకుండా, అత్యంత నిశ్శబ్దంగా వీరిద్దరూ తమ బంధానికి స్వస్తి పలికారు.

అన్‌ఫాలోతో మొదలైన అనుమానం!

సన్యా, రిషబ్ తమ బంధం గురించి ఎప్పుడూ బహిరంగంగా ప్రకటించలేదు. కానీ, తాజాగా వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో వీరు విడిపోయారనే దానికి బలం చేకూరింది, 2025 ప్రారంభంలో మొదలైన వీరి ప్రేమకథ, ఏడాది పూర్తికాకుండానే ముగిసిపోయింది. రిషబ్ ప్రస్తుతం మరో అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నారని, ఆ కారణంతోనే సన్యా ఈ కఠిన నిర్ణయం తీసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కెరీర్ పరంగా సన్యా బిజీ బిజీ..

'దంగల్'లో బబితా కుమారిగా మెప్పించిన సన్యా, గతేడాది 'సన్నీ సంస్కారీ కి తులసి కుమారి', 'బేబీ జాన్' వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'టోస్టర్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 15న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు 'సుందర్ పూనమ్' అనే మరో ప్రాజెక్ట్ కూడా ఆమె చేతిలో ఉంది. గతంలో సన్యా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మొదటి ప్రేమకథ నాలుగేళ్ల తర్వాత బ్రేకప్‌తో ముగిసిందని, అది తనను చాలా బాధించిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు రెండోసారి కూడా ఆమె ప్రేమకథ సుఖాంతం కాకపోవడంతో హాట్ టాపిక్ గా మారింది.

►ALSO READ | అల్లుఅర్జున్ 'రేసుగుర్రం' రీ-రిలీజ్.. థియేటర్లలో నిజమైన గుర్రాలతో ఫ్యాన్స్ హంగామా!

ఎవరీ రిషబ్ రిఖిరామ్ శర్మ?

రిషబ్ కేవలం సితార్ ప్లేయర్ మాత్రమే కాదు, లెజెండరీ పండిట్ రవిశంకర్ చివరి శిష్యుడు. 2022లో వైట్ హౌస్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో, అలాగే 2024 పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో తన సితార్ వాయిద్యంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. 'సితార్ ఫర్ మెంటల్ హెల్త్' అనే కార్యక్రమం ద్వారా మ్యూజిక్ థెరపీ చేస్తూ మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా, సన్యా మల్హోత్రా తన వృత్తిపరమైన బాధ్యతలతో దూసుకుపోతోంది. మరి ఈ బ్రేకప్ వార్తలపై ఈ 'దంగల్' గర్ల్ ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి..