టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'రేసుగుర్రం' మళ్లీ పరిగెడుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజును ( ఏప్రిల్ 8న) పురస్కరించుకుని, ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్లలో ఒకటైన 'రేసుగుర్రం' చిత్రాన్ని మేకర్స్ భారీ ఎత్తున రీ-రిలీజ్ చేశారు. అయితే, ఈ వేడుకల్లో బన్నీ అభిమానులు చేసిన హంగామా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
థియేటర్ల వద్ద వినూత్న 'రేస్'
సాధారణంగా హీరోల బర్త్‌డే అంటే కేక్ కటింగ్స్, భారీ కటౌట్లు, పాలాభిషేకాలు ఉంటాయి. కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకు వేసి సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా నిజమైన గుర్రాలను థియేటర్ల వద్దకు తీసుకువచ్చారు. థియేటర్ బయట గుర్రాలపై స్వారీ చేస్తూ, బన్నీ మాస్ పాటలకు స్టెప్పులేస్తూ వారు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ వినూత్న సెలబ్రేషన్స్ చూసి సామాన్య ప్రేక్షకులు ఆశ్చర్యపోతుండగా, సోషల్ మీడియాలో ఈ వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.
బాక్సాఫీస్ వద్ద అదే జోరు
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 2014లో విడుదలైన ఈ చిత్రం, అప్పట్లోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బన్నీ ఎనర్జీ, శృతి హాసన్ గ్లామర్, కిల్లర్ విలన్‌గా రవి కిషన్ నటన ఒక ఎత్తు అయితే.. 'కిల్ బిల్ పాండే'గా బ్రహ్మానందం చేసిన కామెడీ థియేటర్లలో నవ్వుల పూయించింది. ఇప్పుడు దశాబ్దం తర్వాత కూడా అదే క్రేజ్‌తో థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం విశేషం. తమన్ అందించిన సాంగ్స్ వినిపిస్తుంటే థియేటర్లు కచేరీని తలపిస్తున్నాయి.
►ALSO READ | ఈ సినిమా టిక్కెట్ లక్ష రూపాయలు.. అయినా ఎగబడి కొంటున్నారు.. రిలీజ్‌కు ముందే సంచలనం!
'రాకా'తో రెట్టింపైన ఉత్సాహం
ఒకవైపు పాత సినిమా వేడుకలు జరుగుతుండగానే, మరోవైపు అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా 'రాకా' (Raaka) ఫస్ట్ లుక్ విడుదలవడంతో ఫ్యాన్స్ సంబరాలు రెట్టింపయ్యాయి. సగం మనిషిలా, సగం మృగంలా కనిపించే బన్నీ వైల్డ్ అవతార్ చూస్తుంటే, ఈసారి బాక్సాఫీస్ వద్ద వేట మామూలుగా ఉండదని అర్థమవుతోంది.
వివాదమా? వినోదమా?
గుర్రాలను తీసుకురావడం వెరైటీ ఐడియా అయినప్పటికీ, జంతువుల పట్ల జాగ్రత్త వహించాలని కొందరు నెటిజన్లు సూచిస్తున్నారు. ఏదేమైనా, ఒక సినిమా విడుదలైన పదేళ్ల తర్వాత కూడా అదే స్థాయి క్రేజ్ ఉందంటే అది కేవలం అల్లు అర్జున్ తన కష్టంతో సంపాదించుకున్న 'ఐకానిక్' ఇమేజ్ అని చెప్పక తప్పదంటున్నారు ఫ్యాన్స్. ఈ బర్త్‌డే ట్రీట్‌తో అల్లు అర్జున్ అభిమానులు టాలీవుడ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశారు,.
సినిమా థియేటర్లోకి గుర్రం
— PulseNewsBreaking (@pulsenewsbreak) April 8, 2026
రేసుగుర్రం రీరిలీజ్ సందర్భంగా.. థియేటర్లోకి గుర్రం తీసుకెళ్లిన అల్లు అర్జున్ అభిమానులు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో pic.twitter.com/B3cUsFKwDt
