చంద్రబాబుపై RGV సెటైరికల్ ట్వీట్లు

చంద్రబాబుపై RGV సెటైరికల్ ట్వీట్లు

ఆంధ్ర ప్రదేశ్ లో  ఎన్నికల కౌంటింగ్ చాలా వరకు పూర్తయింది.  వైసీపీ గెలుపు దిశగా పయనిస్తుంది. ఏ పార్టీ మెజారిటిలో ఉంది? అధికారం ఎవరిదనే విషయం ఇప్పటికే స్పష్టం కావడంతో  వైసీపీ పార్టీ ఆఫీస్ ల వద్ద సంబరాలు మొదలయ్యాయి.  ఈ క్రమంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలీలో టీడీపీ నేత చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు.

ఈరోజు ఫలితాలు వెలువడుతున్న సమయంలో వర్మ తన ట్విట్టర్ ద్వారా బాబు గురించి సెటైరికల్ ఫోటోను పోస్ట్ చేశాడు.  సైకిల్ చక్రం వెనుక దిగాలుగా కూర్చొని ఉన్న చంద్రబాబు ఫోటోను షేర్ చేశాడు.  ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరో ట్వీట్ లో తెలుగు దేశం పార్టీ పుట్టిన తేదీ 29 మార్చి 1982 అని అలాగే చనిపోయిన తేదీ 23 మే 2019 అని తెలిపాడు. టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో చనిపోవడానికి గల కారణాలను కూడా వర్మ వెల్లడించాడు. అబద్దాలు, వెన్నుపోట్లు, అవినీతి, వైఎస్ జగన్, నారా లోకేష్‌లు ఏపీలో టీడీపీ చనిపోవడానికి గల కారణాలుగా చూపాడు.