జల్సాలకు కేరాఫ్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు నిర్మాత!

జల్సాలకు కేరాఫ్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు నిర్మాత!

ఆర్జీవీ.. కేరాఫ్ కాంట్రవర్సీ! వినోదం కన్నా వివాదాలనే ‘కలెక్షన్ల మంత్రం’గా మార్చుకున్న వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. మరి అటువంటి వర్మ తనకు తగ్గట్టుగా సూటయ్యే ప్రొడ్యూసర్ నే చూసుకున్నారు. లేటెస్ట్ సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ కో ప్రొడ్యూసర్ అజయ్ మైసూర్ కేరాఫ్ జల్సాలని వర్మ పరిచయం చేశాడు. మావోడు జల్సారాయుళ్లకే జల్సారాయుడంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. ఇండియన్ డాన్ బిల్జరియాన్ అని, చుట్టూ ఎప్పుడూ అమ్మాయిలు ఉండాల్సిందేనని ట్వీట్ లో చెప్పాడు. అయితే కార్లంటే కూడా అజయ్ కు చెప్పలేనంత క్రేజ్ అన్నాడు వర్మ.

హాలీవుడ్ స్టార్ డాన్ బిల్జరియాన్ తో పోలిక

అజయ్ ఇండియన్ డాన్ బిల్జరియాన్ అంటూ హాలీవుడ్ స్టార్ తో  పోల్చాడు వర్మ. డాన్ అమెరికన్ యాక్టర్స్ లో జల్సాలకు కేరాఫ్ అడ్రస్ లాంటోడు. పెద్ద జూదగాడు కూడా. నిత్యం విలాసాలు, వినోదాలు, స్టార్ మోడల్స్ తో చిందులు ఉండాల్సిందే. లావిష్ జీవితానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వ్యక్తి డాన్. అతడి ఇస్టాగ్రామ్ ఒక్కసారి చూస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. క్యాసినో, బీచ్ లలో అందాల ముద్ధుగుమ్మలతో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తాడు. ఇలాంటి లైఫ్ స్టైల్ ఉన్న డాన్ తో అజయ్ ను పోల్చాడంటే అతడు ఏ రేంజ్ ప్లే బాయ్ అనేది అర్థమైపోతుంది.

View this post on Instagram

My self indulgence knows no bounds

A post shared by Dan Bilzerian (@danbilzerian) on