మేడ్చల్, వెలుగు: మేడ్చల్ జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు అగ్నిప్రమాదాల్లో రెండు ఇండ్లు దగ్ధమయ్యాయి. జవహర్ నగర్ పరిధిలోని బీజేఆర్ నగర్లో రాధ అనే మహిళ ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. బీరువాలో దాచుకున్న రూ. 85 వేల నగదుతో పాటు పిల్లల స్టడీ సర్టిఫికెట్లు కలిపి దాదాపు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు ఆరోపించారు. అలాగే, మేడ్చల్ కిష్టాపూర్ అర్చన కాలనీలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం దీపం పెట్టి పనులకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అల్మారాలో ఉన్న రూ. లక్ష నగదు, తులం బంగారం, ఇతర డాక్యుమెంట్లు కాలి బూడిదయ్యాయని బాధితులు తెలిపారు.
