బెస్ట్‌ అనుకున్నాం కానీ వరస్ట్‌ పిచ్‌

బెస్ట్‌ అనుకున్నాం కానీ వరస్ట్‌ పిచ్‌

ఫిరోజ్‌ షా కోట్లా వికెట్‌‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌‌ కోచ్‌ రికీ పాంటింగ్‌‌

న్యూఢిల్లీ: ఫిరోజ్‌ షా కోట్లా పిచ్‌ పై ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌‌ అసహనం వ్యక్తం చేశాడు. హోమ్‌ గ్రౌండ్‌ లో సన్‌ రైజర్స్‌ తో గురువారం జరిగిన మ్యాచ్‌ లో క్యాపిటల్స్‌ పరాజయం పా లైంది. ‘ కోట్లా పిచ్‌ మమ్మల్ని ఆశ్యర్యానికి గురి చేసింది. గ్రౌండ్స్‌ మెన్‌ తో మాట్లాడినప్పుడు బెస్ట్‌‌ వికెట్‌ అనుకున్నాం కానీ చెత్త వికెట్‌ అని తేలింది. వికెట్‌ ఎంత స్లో గా ఉందో చూశాం. బౌన్స్‌ లభించకపోవడం చూశాం. దాని వల్లే మేము ఇషాంత్‌ కు బౌలింగ్‌‌ ఇవ్వలేకపోయాం. మా జట్టు కాంబినేషన్‌కు అస్సలు సరిపోని పిచ్‌ అది. పిచ్‌ ఇలాగే ఉంటే మేం కాంబినేషన్‌ ను మార్చుకుని తీరాలి. ఎలా ఉంటే ఏంటి రెండు జట్లకు ఒకే పిచ్‌ కదా అనొచ్చు. కానీ  రైజర్స్‌ లాంటి టీమ్‌ తో పోరులో ఇలాంటి వికెట్‌ ను నేను కోరుకోను’ అని పాంటింగ్‌‌ అన్నాడు.