నార్సింగి లో ‘రైడ్ ఫర్ భారత్’...పాల్గొన్న 250 మంది సైక్లిస్టులు, రన్నర్లు

నార్సింగి లో ‘రైడ్ ఫర్ భారత్’...పాల్గొన్న 250 మంది సైక్లిస్టులు, రన్నర్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ మూవ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా నార్సింగిలోని సోలార్ సైక్లింగ్ ట్రాక్ వద్ద ఆదివారం ఉదయం సైక్లింగ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంధన దిగుమతులను తగ్గించి ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి మద్దతు తెలిపే ఉద్దేశంతో ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా  హైదరాబాద్ సైక్లింగ్ రివల్యూషన్ ఆధ్వర్యంలో ‘రైడ్ ఫర్ భారత్’  ప్రోగ్రాం చేపట్టారు.  

ఇందులో 250 మందికి పైగా సైక్లిస్టులు, రన్నర్లు, కుటుంబసభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు. వీరందరూ కలిసి రూపాయి గుర్తు రూపంలో నిలుచున్నారు. రోజువారీ జీవితంలో చిన్న చిన్న ప్రయాణాలకు సైకిల్‌‌‌‌‌‌‌‌ ఉపయోగించడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించవచ్చని, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసి రూపాయి విలువను బలోపేతం చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు.