ఐపీఎల్‎లో స్టార్ ఆల్ రౌండర్ రింకు సింగ్‎కు ప్రమోషన్

ఐపీఎల్‎లో స్టార్ ఆల్ రౌండర్ రింకు సింగ్‎కు ప్రమోషన్

కోల్‎కతా: టీమిండియా స్టార్ బ్యాటర్ రింకు సింగ్‎కు ఐపీఎల్‎లో ప్రమోషన్ దక్కింది. కోల్‎కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వైస్ కెప్టెన్‎గా రింకు సింగ్ ఎంపికయ్యాడు. తద్వారా ఐపీఎల్ 19వ సీజన్‎లో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేకు రింకు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని కేకేఆర్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకీ మైసూర్ మంగళవారం (మార్చి 24) అఫిషియల్‎గా ప్రకటించారు. ‘‘రింకు సింగ్ కేకేఆర్ వైస్ కెప్టెన్‌గా ఉంటారని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. రింకు 2018లో కేకేఆర్‌లో చేరాడు. అప్పటి నుంచి జట్టులో రెగ్యులర్‌గా ఆడుతున్నాడు’’ అని పేర్కొన్నాడు. 

రింకు ఐపీఎల్ కెరీర్:

బెస్ట్ ఫినిషర్‎గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ 2018లో ఐపీఎల్‎లో అరంగ్రేటం చేశాడు. అప్పటి నుంచి కేకేఆర్ తరుఫునే ఆడుతున్నాడు. రింకు ఇప్పటి వరకు 59 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 30.52 సగటు, 145.17 స్ట్రైక్ రేట్‌తో 1099 రన్స్ చేశాడు. 2023లో కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీ గెలవడంలో రింకు సింగ్‎ది  కీలక పాత్ర. ఆ సీజన్‎లో14 ఇన్నింగ్స్‌లలో 474 పరుగులు చేసి కేకేఆర్ కు మూడోసారి ట్రోఫీ అందించాడు. 

►ALSO READ | IPL Captains Meeting: రేపే ఐపీఎల్ కెప్టెన్లతో బీసీసీఐ కీలక సమావేశం.. చర్చకు వచ్చే అంశాలివే..!

ఆర్సీబీతో జరిగిన ఓ మ్యాచులో యశ్ దయాల్ బౌలింగ్‎లో ఒకే ఓవర్‎లో వరుసగా 5 సిక్సులు కొట్టడం రింకు బెస్ట్ ఇన్నింగ్స్‎లలో ఒకటి. మరీ ఈ సీజన్‎లో వైస్ కెప్టెన్‎గా కొత్త బాధ్యతలు చేపట్టనున్న రింకు సింగ్ ఏ మేర  రాణిస్తాడో చూడాలి. కేకేఆర్ ఐపీఎల్ 19వ సీజన్‎ను మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభించనుంది.