IPL Captains Meeting: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 28వ తేదీన ప్రారంభం కానుంది. 19వ సీజన్‌కు మరో నాలుగు రోజులే సమయం ఉంది. ఈ మెగా టోర్నీ సమీపిస్తున్నందున 10 జట్ల కెప్టెన్లతో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక సమావేశం నిర్వహించబోతుంది. రేపు (మార్చి 25) ఐపీఎల్ సారథులతో సాయంత్రం 4 గంటలకు భేటీ జరగనుంది. ఈ సందర్భంగా బీసీసీఐ, 10 టీమ్స్ కెప్టెన్ల మధ్య పలు కీలక అంశాలు చర్చించేందుకు అవకాశం ఉంది.
ఈ సమావేశానికి బీసీసీఐ మ్యాచ్ రిఫరీలు జవగళ్ శ్రీనాథ్, నితిన్ మీనన్, అంపైర్ ప్యానెల్ సభ్యులు కెప్టెన్లతో మాట్లాడతారు. ఈ సందర్భంగా ఇన్నింగ్స్ టైమర్(60 సెకన్లు), ఇంపాక్య్ ప్లేయర్ రూల్, కంకషన్ సబ్‌స్టిట్యూట్, ఒక ఓవర్లో రెండు బౌన్సర్లు, బ్యాట్ చెకింగ్, బాల్ మార్చడం, బంతిపై లాలాజలం రుద్దడం, రిటైర్డ్ ఔట్ రూల్ వంటివి ప్రధానంగా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అంశాలపై మ్యా్చ్ రిఫరీలు, అంపైర్లు 10 జట్ల సారథుల అభిప్రాయాలు, అనుమానాలు తెలుసుకోనున్నారు.
►ALSO READ | Ben Duckett: ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్.. బెన్ డకెట్పై 3 ఏళ్ల నిషేధం!
మార్చి 28వ తేదీన ఐపీఎల్ 19వ ఎడిషన్ ప్రారంభం కాబోతుంది. ఈ లీగ్ మొదటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7: 30 గంటలకి ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది.
