Ben Duckett: మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ డాషింగ్ ఓపెనర్ బెన్ డకెట్ వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆయనను రూ. 2 కోట్లకు దక్కించుకుంది. కేఎల్ రాహుల్‌తో కలిసి బెన్ డకెట్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారని అభిమానులు ఆశించారు. కానీ, టోర్నీ ప్రారంభానికి కేవలం నాలుగు రోజుల ముందు అతడు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇది చాలా కష్టమైన నిర్ణయం.. ఢిల్లీ ఫ్రాంచైజీకి నేను క్షమాపణలు చెబుతున్నాను.. వేలంలో నన్ను ఢిల్లీ లాంటి గొప్ప జట్టు ఎంచుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని బెన్ డకెట్ వెల్లడించారు. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యుత్తమ టోర్నీ, అక్కడ ఆడటం గొప్ప అనుభూతినిస్తుంది.. కానీ నా కెరీర్ దృష్ట్యా ప్రస్తుతానికి ఇది సరైన నిర్ణయమని నేను భావిస్తున్నాను.. భవిష్యత్తులో ఎప్పుడైనా ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని ఆశిస్తున్నాను అని తన సోషల్ మీడియా అకౌంట్ లో బెన్ డకెట్ వెల్లడించారు.
►ALSO READ | PSL 2026: పాకిస్తాన్కి బంగ్లా గట్టి షాక్.. PSL ఆడేందుకు నో పర్మిషన్
ఐపీఎల్ నిబంధనల ప్రకారం, బెన్ డకెట్ లీగ్ నుంచి మూడేళ్ల నిషేధాన్ని ఎదుర్కోవచ్చు అనే ప్రచారం జరుగుతుంది. టోర్నమెంట్‌కు ముందే ఆటగాళ్లు తప్పుకోవడం, ఫ్రాంచైజీలను ఇబ్బందుల్లోకి నెట్టడం వంటి పలు ఘటనలతో బీసీసీఐ విదేశీ ఆటగాళ్లపై ఈ నిబంధనను అమలు చేసింది. రూ. 4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, గత సీజన్‌లో జట్టు నుంచి వైదొలగిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఈ నిబంధనకు బలి అయిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.
