హైదరాబాద్ లో 3 రివర్ స్టోర్లు షురూ

హైదరాబాద్ లో 3 రివర్ స్టోర్లు షురూ

హైదరాబాద్​, వెలుగు: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ రివర్ మొబిలిటీ హైదరాబాద్ లో మూడు కొత్త స్టోర్లను ప్రారంభించింది. అత్తాపూర్, ఆర్ సీ పురం, హైటెక్ సిటీలలో ఇవి అందుబాటులోకి వచ్చాయి. సన్‌‌‌‌రైజ్ మోటోహైవ్ భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేశారు.  ఇండి స్కూటర్లతో పాటు ఇతర పరికరాలను ఇక్కడ కొనుక్కోవచ్చు. 

ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 45 స్టోర్లు ఉన్నాయి. హైదరాబాద్ లో ఇండి స్కూటర్ ధర రూ.1.44 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హైటెక్ సిటీ వంటి ప్రాంతాల నుంచి మంచి స్పందన వస్తుందని సీఈఓ అరవింద్ మణి తెలిపారు.