వనస్థలిపురంలో బైక్‎ను ఢీకొట్టి 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ స్పాట్ డెడ్

వనస్థలిపురంలో బైక్‎ను ఢీకొట్టి 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ స్పాట్ డెడ్

హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని, బైక్‎పై వెళ్తున్న మరో ఇద్దరు యువకులను హోండా సిటీ కార్ ఢీకొట్టింది. బైక్‎ను దాదాపు 100 మీటర్లు ఇడ్చుకెళ్ళి అనంతరం కారు పల్టీలు కొడుతూ రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో బైక్‎పై ఉన్న యువకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా.. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉంది.

 స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికికి తరలించారు. ప్రమాదం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన యువకులిద్దరూ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్‎లో ఈసీఈ సెకండియర్ చదువుతోన్న శివ, సందీప్ జోహెల్‎గా గుర్తించారు పోలీసులు. 

శివ, సందీప్ జోహల్ మృతి చెందారని తెలుసుకున్న తోటి కాలేజీ విద్యార్థులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ప్రమాదం చేసిన వ్యక్తిని తమకు అప్పగించాలని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగాద్వం చోటు చేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు.