రోడ్డు పక్కన కటింగ్ నచ్చి.. రూ.28 వేలు ఇచ్చాడు

రోడ్డు పక్కన కటింగ్ నచ్చి.. రూ.28 వేలు ఇచ్చాడు

రోడ్డు పక్కనే చిన్న కుర్చీ. దాని ముందో అద్దం . ఒక కటింగ్ కు 20 రూపాయల ఆదాయం. అదే జీవనానికి ఆధారం. అలాంటి ఓ హెయిర్ కటర్‌‌ను లక్కు లాగి తన్నింది . ఓ చిన్న కటింగ్, దానికి తగ్గ నిజాయితీ అతనికి 28 వేల రూపాయలు తెచ్చి పెట్టింది . నార్వేకు చెంది న హెరాల్డ్ బాల్డర్ ట్రావెట్ అనే బ్లాగర్.. గుజరాత్ లోని అహ్మదాబాద్‌ కు వెళ్లాడు. ఫుట్ పాత్ పై ఉన్న సెలూన్ వద్దకు వెళ్లి హెయిర్ కట్ చేయాలని అడిగాడు. కొంచెం షాకైన అతడు, తేరుకుని వెంటనే ప్రదేశాన్ని క్లీన్ చేసి బాల్డర్ హెయిర్ ట్రిమ్ చేశాడు. ఈ తతంగాన్నంతా బాల్డర్ తన కెమెరాలో చిత్రీకరించాడు. ‘‘వ్యాపారం ఎలా సాగుతోంది. ఇలా ఫుట్ పాత్ పై వ్యాపారం చేయడానికి ఎవరికైనా డబ్బు చెల్లించాలా’’ అని ప్రశ్నించి పలు విషయాలు తెలుసుకున్నాడు. కటింగ్ అయిన తర్వాత హెయిర్ డ్రెస్సర్ తో సెల్ఫీ దిగాడు. వెళ్లేముందు ఎంతైందని అడగ్గా, హెయిర్ డ్రెస్సర్ ఇరవై రూపాయలని చెప్పడంతో హెరాల్డ్ ఆశ్చర్యపోయాడు. అతడు ఎక్కువ ఆశిస్తాడని తాను భావించానని హెరాల్డ్ వీడియోలో చెప్పా డు. అతని నిజాయితీ నచ్చి రూ.28 వేలు ఇచ్చానని చెప్పాడు. ఆ అభిమానం నచ్చి ట్రావెట్‌ కు ఓ కాఫీ తాగించాడు ఆ బార్బర్‌.