ఈ డ్రోన్ గాల్లో ఎగరడమే కాదు నేలమీద నడుస్తుంది

ఈ  డ్రోన్ గాల్లో ఎగరడమే కాదు నేలమీద నడుస్తుంది

డ్రోన్లు అంటే గాల్లో ఎగురుతాయి.  కావాల్సిన ఫొటోలు, వీడియోలు తీస్తాయి. ఇప్పుడు వస్తువులు డెలివరీ కూడా చేస్తున్నాయి. వాటిని నేల మీద వాడలేం. కానీ ‘లియో’ అనే ఈ డ్రోన్​ తో ఈ పనులన్నీ  చేయొచ్చు. ఆపరేటర్​ కమాండ్స్​ను బట్టి ఈ బుల్లి  డ్రోన్​ గాల్లో ఎగరడంతో పాటు నేల మీద  నడుస్తుంది కూడా..  

లియో  అనే ఈ కొత్తరకమైన డ్రోన్​ను అమెరికాకు చెందిన సెంటర్​ ఫర్​ అటానమస్​ సిస్టమ్స్​ అండ్​ టెక్నాలజీ ( కాస్ట్)  తయారు చేసింది.  గాల్లో ఎగురుతూ  ఫొటోలు, వీడియోలు తీస్తుంది.  నేలమీద నడుస్తూ  కూడా ఈ పనులు చేస్తుంది. ఇప్పటి వరకు ఇలా రెండు రకాలుగా పని చేసే డ్రోన్లు రాలేదు.  దీంతో పాటు తాడుపై సర్కస్, స్కేట్‌‌‌‌ బోర్డుపై ఫీట్లు కూడా చేస్తుంది లియో.  దీనికి కాళ్లు ఉంటాయి.  భుజాల దగ్గర లిఫ్టింగ్​ ఫ్యాన్లు ఉంటాయి. దీని ఎత్తు రెండున్నర ఫీట్లు. ఆపరేటర్​ కమాండ్స్​ను పాటిస్తూ నడిచే చోట నడుస్తూ.. అవసరమైన చోట డ్రోన్​గా మారి పైకి లేస్తుంది. ఇది సెకనుకు 20 సెంటీమీటర్ల దూరం నడవగలదు. 

దీనికి హైబ్రిడ్‌‌‌‌ మూవ్‌‌‌‌మెంట్‌‌‌‌ పవర్​ సప్లయ్​ ఉంటుంది. దీనివల్ల ఒక చోటు నుంచి మరో చోటుకి కదులుతుంది. మెట్లు కూడా ఎక్కగలుగుతుంది. ఈ డ్రోన్​ తయారీకి‘ఆకాశంలో ఎగురుతూ, నేల మీద నడుస్తూ తమ అవసరాలకు తగ్గట్టు మారే పక్షులే ఇన్​స్పిరేషన్​​’ అని చెబుతోంది కాస్ట్​ టీమ్. మామూలు డ్రోన్లకు బ్యాటరీ లిమిట్స్​ ఉంటాయి. కానీ లియోకి అలా ఉండదని అంటున్నారు. హై వోల్టేజ్‌‌‌‌ లైన్లను టెస్ట్​ చేయడానికి, స్పేస్​ సెంటర్లలో కొన్ని క్రిటికల్​ ప్లేస్​లకు దీన్ని పంపేందుకు వీలుంది. అయితే మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? దీని రేటు ఎంత అనే విషయాలు ఇంకా చెప్పలేదు.