టీమిండియా వన్డే, టీ20ల కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ తొలి సారి విరాట్ కొహ్లీ కెప్టెన్సీపై స్పందించాడు. కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టుకు ఆడటం గర్వంగా అనిపించేదన్నారు. కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసిందన్నాడు. కోహ్లీతో ఆడేటప్పుడు ఆటను ఎంజాయ్ చేస్తామన్నాడు. బీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి చెప్పాడు. టీంగా తాము వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా చేశాడని కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు రోహిత్. కోహ్లీ ఇచ్చిన స్ఫూర్తితోనే జట్టును నడిపిస్తానన్నాడు.
