ఆర్సీబీ కప్‌ కొడుతుందా?

ఆర్సీబీ  కప్‌ కొడుతుందా?

ప్రతి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు ‘ఈసారి కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాదే’ అంటూ ముందుకొచ్చే రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంగళూరు.. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–14 సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడిన ఏడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఐదింటిలో నెగ్గిన కోహ్లీసేన 10 పాయింట్లతో థర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతోంది. అయితే మిగిలిన ఏడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో కనీసం రెండింటిలో గెలిచినా ఈజీగా ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డివిలియర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే ఎక్కువగా ఆధారపడకుండా మ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పడిక్కల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హర్షల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సహకారం అందితే కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల నెరవేరే అవకాశాలున్నాయి. యూఏఈ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ మార్పులు జరిగాయి. ఆడమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంపా, డానియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిచర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానాల్లో వానిందు హసరంగ, దుష్మంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చమీరా, జార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గార్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సింగపూర్) టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తీసుకున్నారు. లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోషించిన యజ్వేంద్ర చహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డపై కూడా మరోసారి మెరిస్తే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీకి తిరుగుండదు.  సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జెమీసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైనీ వంటి నాణ్యమైన పేసర్లు అందుబాటులో ఉన్నారు. 

నాలుగు మార్పులతో రాజస్తాన్​

పాయింట్ల పట్టికలో ఆరు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. నాలుగు మార్పులతో సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. వేర్వేరు కారణాలతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జోఫ్రా ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేవలు కోల్పోయిన రాయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. వారి స్థానంలో ఓషేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థామస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), ఎవిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లూయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ( వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌).  గ్లెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను జట్టులోకి తీసుకుంది. ఇక, పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆండ్రూ టై కి  రీప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తబ్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షంషీ (సౌతాఫ్రికా)ని జట్టులో చేర్చుకుంది. ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడిన ఏడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో రెండు సార్లు 200కు పైగా రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం ఆ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలానికి నిదర్శనం. అయితే ఈసారి బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో  కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంజు శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఒత్తిడి పెరగనుంది.  ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లూయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు లియామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లివింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీలకం కానున్నారు.  షంషీ రాకతో తమ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా మెరుగుపడుతుందని రాయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమ్మకంగా ఉంది. రియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెవాటియా, చేతన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సకారియాపై భారీ అంచనాలున్నాయి. 

గేల్‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌లోకి వస్తేనే..

టీ20 స్పెషలిస్ట్‌‌‌‌లు కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌, క్రిస్‌‌‌‌ గేల్‌‌‌‌, మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, దీపక్‌‌‌‌ హుడా, నికోలస్‌‌‌‌ పూరన్‌‌‌‌ టీమ్‌‌‌‌లో ఉన్నా.. పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌ రాత మాత్రం మారడం లేదు. ఎనిమిది మ్యాచ్‌‌‌‌లు ఆడి మూడు విజయాలతో ఆరు పాయింట్లతో ఆరో ప్లేస్‌‌‌‌లో ఉన్న పంజాబ్‌‌‌‌ బాగా కష్టపడితేనే ప్లే ఆఫ్స్‌‌‌‌పై ఆశలు పెట్టుకోవచ్చు. అయితే ఇది సాధ్యం కావాలంటే యూనివర్స్ బాస్‌‌‌‌ గేల్‌‌‌‌ ఫామ్‌‌‌‌లోకి రావాలి. ఇటీవల గేల్‌‌‌‌ ఆడిన 10 మ్యాచ్‌‌‌‌ల్లో ఏ ఒక్కదాంట్లో తన మార్క్‌‌‌‌ ఆటను చూపెట్టలేకపోయాడు. భారీ రన్స్‌‌‌‌ కూడా చేయలేకపోయాడు. ఇక మిడిలార్డర్‌‌‌‌లో పూరన్‌‌‌‌ డకౌట్లకు ఫుల్‌‌‌‌స్టాప్‌‌‌‌ పెట్టాలి. దీపక్‌‌‌‌ హుడా, షారూక్‌‌‌‌ ఖాన్‌‌‌‌ మెరిస్తే భారీ స్కోరు ఖాయం. ఆసీస్‌‌‌‌ పేస్‌‌‌‌ ద్వయం జే రిచర్డ్‌‌‌‌సన్‌‌‌‌, మెరిడిత్‌‌‌‌ లేకపోవడం లోటే అయినా.. షమీ ఫామ్‌‌‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. ప్రస్తుతం పంజాబ్‌‌‌‌ మిగిలిన ఆరు మ్యాచ్‌‌‌‌ల్లో కనీసం నాలుగింటిలోనైనా గెలిస్తే ఇతర జట్లతో ప్లేఆఫ్స్‌‌‌‌కు పోటీపడొచ్చు. మరి ఇది సాధ్యమవుతుందో లేదో చూడాలి.