- 95.60 స్థాయికి పెరుగుదల
- ఇది వంద దాటినా డోంట్కేర్
- ఆర్థిక సంఘం చైర్మన్ పనగరియా
న్యూఢిల్లీ: ముడిచమురు ధరలు తగ్గడం, రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకోవచ్చనే అంచనాలతో రూపాయి శుక్రవారం 76 పైసలు పుంజుకొని రూ.95.60 వద్ద ముగిసింది. ఇరాన్‌తో యుద్ధం ముగింపు కోసం చర్చలు జరుగుతున్నాయని అమెరికా చేసిన ప్రకటనతోనూ ఊరట లభించిందని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు. యూఎస్ ట్రెజరీ రాబడులు తగ్గడం, స్టాక్ మార్కెట్లు లాభపడటం కూడా రూపాయికి కలిసి వచ్చింది.
ఇదిలా ఉంటే, రూపాయి విలువ తగ్గినా తదనంతరం కోలుకుంటుందని, విలువ రూ.100 మార్కును తాకినా ఆర్బీఐ జోక్యం చేసుకోవద్దని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా పేర్కొన్నారు. చమురు ధరలు తగ్గితే రూపాయి విలువ పెరుగుతుందని, విలువ ఎక్కువ ఉండటం వల్ల మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఎక్స్ పోస్టులో రాశారు. ఈ ఏడాది మన కరెన్సీ విలువ సుమారు ఏడు శాతం తగ్గింది. రానున్న నెలల్లో ఇది రూ.97.5 మార్కును దాటవచ్చని అంచనా.
