భద్రాచలం ఆలయంలో గది నిర్మాణానికి రూ.12 లక్షల విరాళం

భద్రాచలం ఆలయంలో గది నిర్మాణానికి రూ.12 లక్షల విరాళం

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జానకీ సదనంలో గది నిర్మాణానికి విజయవాడ భారతీనగర్​కు చెందిన నర్సింహారావు అనే భక్తులు ఆదివారం రూ.12 లక్షలు విరాళంగా అందజేశారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం విరాళాలు సేకరించి ఈ సదనాన్ని నిర్మిస్తోంది.

కాగా, భద్రాద్రి రామయ్యకు గర్భగుడిలో ఉదయం పంచామృతాలతో అభిషేకం చేసి, అలంకరణ చేసి బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. బేడ మండపంలో నిత్య కల్యాణం, సాయంత్రం దర్బారు సేవ చేశారు.