రూ. 34 కోట్ల స్కూల్ గ్రాంట్స్ రిలీజ్

రూ. 34 కోట్ల  స్కూల్ గ్రాంట్స్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: విద్యాసంవత్సరం ప్రారంభమైన 20 రోజులకు రాష్ట్ర సర్కారు స్కూల్ గ్రాంట్స్ రిలీజ్ చేసింది. 2023–24 సంవత్సరానికి ఇవ్వాల్సిన దాంట్లో 50 శాతం విడుదల చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం విద్యార్థులున్న 25,381 బడులకు రూ.68.19 కోట్ల స్కూల్ గ్రాంట్స్ ఇవ్వాల్సి ఉంది. 

దీంట్లో 50 శాతం అంటే రూ.34.09 కోట్లు తాజాగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంట్లో 20,905 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు రూ.23.7కోట్లు, 4476 హైస్కూళ్లకు రూ.10.3కోట్లకు పైగా నిధులు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. మరోపక్క అన్ని స్కూళ్లకు రూ.8.22కోట్ల స్పోర్ట్స్ గ్రాంట్స్​నూ రిలీజ్ చేశారు.