సింగరేణి ఉద్యోగులకు రూ. 50 లక్షల ప్రమాద బీమా

సింగరేణి ఉద్యోగులకు రూ. 50 లక్షల ప్రమాద బీమా
  • సింగరేణి ఆఫీసర్లు, వర్కర్లకు రూ. 50 లక్షల ప్రమాద బీమా
  • డెరెక్టర్​ ఎన్.బలరాం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కంపెనీలో పనిచేసే ఆఫీసర్లు, కార్మికులకు రూ.50 లక్షల ప్రమాద బీమా వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్​ఎన్.బలరాం వెల్లడించారు. కొత్తగూడెంలోని హెడ్డాఫీస్​లో బుధవారం ఆయన హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్​స్టేట్ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. బీమా చెల్లింపుపై చర్చించారు. ఈ  సందర్భంగా డైరెక్టర్​మాట్లాడుతూ.. కంపెనీలో పనిచేసే ఆఫీసర్, వర్కర్​ప్రమాదవశాత్తు మరణిస్తే, వారికి హెచ్ డీఎఫ్​సీ బ్యాంక్​లో కార్పొరేట్​శాలరీ అకౌంట్ ఉన్నట్లయితే రూ.40 లక్షల ప్రమాద బీమా వస్తుందన్నారు. అలాగే హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ డెబిడ్​ కార్డు వాడుతున్నట్లయితే అదనంగా మరో రూ. 10 లక్షలు చెల్లించనున్నట్టు తెలిపారు. కాంట్రాక్ట్​వర్కర్స్ కు రూ.30లక్షల ప్రమాద బీమా వస్తుందన్నారు. అపోలో హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ తీసుకునే వారికి రోజుకు రూ.వెయ్యి చెప్పున 15 రోజులు చెల్లించనున్నట్టు వెల్లడించారు. కంపెనీ ఉద్యోగులు విమాన ప్రమాదంలో మృతి చెందితే కోటి రూపాయల ప్రమాద బీమా చెల్లిస్తామన్నారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన ఉద్యోగి ఇద్దరు పిల్లల ఉన్నత చదువుల కోసం ఒక్కొక్కరికి రూ.4లక్షల చొప్పున ఫీజు రీయింబర్స్​మెంట్​ఇవ్వనున్నట్టు బ్యాంక్​ఆఫీసర్లు వివరించారు. పూర్తి వివరాలకు వర్కర్స్​ సంబంధిత మైన్ల వెల్ఫేర్​ఆఫీసర్లను కలవాలని జీఎం పర్సనల్​ఎ.ఆనందరావు సూచించారు. మీటింగ్​లో జీఎం వెల్ఫేర్​కె.బసవయ్య, సింగరేణి ఆఫీసర్లు సుబ్బారావు, రమేశ్​బాబు, వెంకటరమణ, హనుమంతరావు, కొమరయ్య, కవితానాయుడు, హరినారాయణ్​పాల్గొన్నారు.