
హైదరాబాద్ లో డ్రగ్స్ , గంజాయి సరఫరా నియంత్రణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఎక్కడిక్కడ దాడులు చేసి గంజాయి బ్యాచ్ ను అరెస్ట్ చేస్తోంది.
అయినా సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, ఛత్తీస్ గఢ్, కర్ణాటక లనుంచి గంజాయి తీసుకొచ్చి సిటీలో అమ్ముతున్నారు. పోలీసులు నిఘాపెట్టి తనిఖీ చేస్తూ గంజాయి రవాణ, విక్రయాలను అడ్డుకుంటున్నప్పటికీ గంజాయి దందా మాత్రం ఆగడం లేదు. అడ్డదారిలో అమ్మకాలు జరుపుతూ కోట్లు గడిస్తున్నారు. యువతను మత్తులోకి దించుతున్నారు.
సెప్టెంబర్ 30న రాచకొండ కమిషనరేట్ పరిధి అబ్దుల్లాపూర్ మెట్ లో డీసీఎంలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సిమెంట్ బ్యాగుల మధ్యలో గంజాయి తరలిస్తున్నారు. వీరి నుంచి రూ. 6 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు . మహేశ్వరం పోలీసులు, ఎస్ఓటి పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేస్తండగా.. గంజాయి తరలిస్తున్న కీలక నిందితుడిన పట్టుకున్నారు పోలీసులు.