- మున్సిపోల్స్‌లో సీజ్ చేసినట్టు వెల్లడించిన రాణి కుముదిని
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.89 లక్షల క్యాష్, రూ.84 లక్షల విలువైన లిక్కర్సీజ్ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని శనివారం ప్రకటించారు. రూ.13.27 లక్షల విలువ చేసే డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు, రూ.78 వేల విలువ చేసే ట్యా బ్స్కూడా సీజ్‌చేశామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా నియమించిన ఎంసీసీ కమిటీలు పకడ్చందీగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఏవైనా కంప్లైంట్స్ ఉంటే ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయడానికి 9247597066 నంబర్ అందుబాటులో ఉంటుందని కమిషనర్ ప్రకటించారు.
గెజిటెడ్ ఆఫీసర్లను శిక్షణ
మున్సిపల్మేయర్, చైర్పర్సన్ల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియమించిన గెజిటెడ్ ఆఫీసర్లకు శనివారం ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం పూర్తిచేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. జిల్లాల వారీగా మాస్టర్‌ట్రైనర్లు వీరికి శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు.
