మాతృత్వమే సృష్టికి మూలాధారం...పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా ఫాలో కావద్దు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

మాతృత్వమే సృష్టికి మూలాధారం...పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా ఫాలో కావద్దు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
  •     మహిళలు దాసీలు కాదు, శక్తి స్వరూపిణులు 

హైదరాబాద్, వెలుగు: సృష్టికి, పోషణకు, మానవ మనుగడ కొనసాగింపునకు మాతృత్వమే మూలాధారమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని సేవాలాల్ బంజారా భవన్‌‌‌‌‌‌‌‌లో విశ్వ మాంగల్య సభ ఆధ్వర్యంలో జరిగిన 'దక్షిణ భారత ప్రబోధన్ బైఠక్' ముగింపు సభలో ఆయన మాట్లాడారు. సమాజంలో కుటుంబ విలువలు చాలా ముఖ్యమని, త్యాగం నుంచే సంస్కారాలు ఏర్పడతాయని చెప్పారు. స్త్రీ పురుషులు అన్నింటా సమానమేనని, అయితే ప్రతి సృష్టి చేయగల అద్భుత శక్తి స్త్రీకి మాత్రమే ఉందని కొనియాడారు. 

మారుతున్న కాలంలో మహిళలను తక్కువగా చూడటం సరైన పద్ధతి కాదన్నారు. కాలంతో పాటు మార్పులు సహజమేనని, అయితే పాశ్చాత్య దేశాల సంస్కృతిని గుడ్డిగా పాలోకావద్దని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. సమావేశంలో నిర్వాహకులు జితేంద్రనాథ్ మహారాజ్, నలిని హవాడే, రుశాలి జోషి తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి సుమారు 150 మంది మహిళా ప్రతినిధులు ఈ బైఠక్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారు.