గువహటి/న్యూఢిల్లీ: నీట్-యూజీ పరీక్షల పేపర్ లీక్ అంశంపై 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) చేపట్టిన నిరసనలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సీనియర్ నాయకుడు అతుల్ లిమాయే విమర్శలు గుప్పించారు. ఛత్రపతి శంభాజీనగర్‌లో జరిగిన ఏబీవీపీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీజేపీ ఆందోళనలను ఒక 'కేస్ స్టడీ'గా అధ్యయనం చేయాలన్నారు. ఈ నిరసనల ముసుగులో విదేశీ, రాజకీయ శక్తులు చొరబడి "ప్రజాస్వామ్య మార్గాల ద్వారానే ప్రజాస్వామ్యాన్ని అణచివేసే" కుట్ర జరిగిందని ఆరోపించారు. న్యాయవ్యవస్థపై నమ్మకం సడలించేలా సాగిన ఈ ఉద్యమం "ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఓ ప్రయోగం" అని అభివర్ణించారు.
గాడ్సేయే దేశంలో మొదటి దేశద్రోహి..
ఆర్ఎస్ఎస్ నేత వ్యాఖ్యలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తీవ్రంగా స్పందించారు. మహాత్మా గాంధీని హత్య చేసిన వారికి ఎవరినీ దేశద్రోహులుగా పిలిచే నైతిక హక్కు లేదని తేల్చిచెప్పారు. నాథూరామ్ గాడ్సేయే దేశంలో మొదటి దేశద్రోహి అని విమర్శించారు
