హైదరాబాద్: కార్గోలో క్లెయిమ్ చేయని వస్తువులకు రేపు(ఆగస్టు 05) వేలం

హైదరాబాద్: కార్గోలో క్లెయిమ్ చేయని  వస్తువులకు రేపు(ఆగస్టు 05) వేలం

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గోలో కస్టమర్లు తీసుకెళ్లని పార్శిళ్లను వేలం వేయనున్నట్టు కంటోన్మెంట్​డిపో మేనేజర్​కవిత ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జేబీఎస్​లోని కార్గో కౌంటర్​వద్ద వేలం పాట నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆటోమొబైల్స్, బయో మెడికల్, క్లాత్, ఎలక్ట్రికల్, జనరల్​ ఐటమ్స్, ఫార్మా వంటివి ఉన్నాయని తెలిపారు.