మేము కేసిఆర్ ను తండ్రిలా భావించాం.. డిస్మిస్ చేసి బాధ పెట్టాడు

మేము కేసిఆర్ ను తండ్రిలా భావించాం.. డిస్మిస్ చేసి బాధ పెట్టాడు

ముఖ్యమంత్రి కేసీఆర్ తనని తిట్టిన వారిని ఎమ్మెల్యేలను, మంత్రుల్ని చేశారని, సకుల జనుల సమ్మెలో మద్దతు పలికిన తమని ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం ఎంతవరకు సమంజసమని ఆర్టీసీ మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం తమ గురించి ఏం అనుకుంటున్నారో చెబితే తాము అందుకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రిని తండ్రిలాగా భావిస్తున్న తమని విధుల నుంచి తొలగించడం దారుణమన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీలో విలీనం చేయడం సాధ్యం కాకపోతే చెప్పాలని, ఎమ్మెల్యేలు, మంత్రుల్లాగా తాము జీతాలు తీసుకోవడంలేదని సూచించారు. దసరా పండుగ చేసుకుందామన్న ఇప్పటివరకు జీతాలు అందలేదని వాపొతున్నారు. సమ్మె చేస్తామని తెలిసే జీతాల్ని నిలిపివేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్ల కోసం సమ్మెలు చేయడం లేదని, సకల జనుల సమ్మెలో కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. సకుల జనుల సమ్మెలో కేసీఆర్ కు మద్దతిస్తే ఇప్పుడు తమను ఉద్యోగాలనుంచి తొలగిస్తున్నామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు.