డిపోల ముందు ధర్నా చేస్తున్న కార్మికులు అరెస్ట్

డిపోల ముందు ధర్నా చేస్తున్న కార్మికులు అరెస్ట్

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ రోజు ‘బస్ రోకో’ కార్యక్రమానికి జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. నేతల పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు పలు డిపోల ముందు బస్సుల బయటకు రాకుండా బైటాయించారు. పాతబస్తీ ఫారూఖ్ నగర్ డిపో నుండి బస్సులు బయటకు రాకుండా కార్మికులు డిపో ముందు రోడ్డుపై కూర్చోని నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్న దాదాపు 15 మంది కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఫారూఖ్ నగర్ కార్మిక నేతలు, కార్మికులు, మహిళ కార్మికులు కూడా ఉన్నారు.

ఫలక్‌నూమా డిపో నుండి బస్సలను బయటకు రాకుండా డిపో ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న దాదాపు 50 మంది కార్మికులను ఫలక్‌నూమా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. అరెస్ట్ చేసిన కార్మికులను పహడిషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.