కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే : ఆర్టీసీ జేఏసీ కన్వీనర్

కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే : ఆర్టీసీ జేఏసీ కన్వీనర్

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందో లేదో అర్ధం కావడం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్  అశ్వత్థామ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మె పై గవర్నర్  తమిళిసై సౌందరరాజన్ తో  ఆర్టీసీ జేఏసీ నాయకులు భేటీ అయ్యారు. భేటీ అనంతరం అశ్వత్థామ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమ్మెపై  గవర్నర్ కు  మెమోరాండం ఇచ్చినట్లు తెలిపారు.  ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమం,పోలీస్ కార్మికుల పై దాడి చేసిన వీడియోలను అందజేసినట్లు సూచించారు. హక్కుల కోసం 10 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసులు చేస్తున్న దాడిని గవర్నర్ కు వివరించినట్లు చెప్పారు. కార్మికుల ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు .  నిజామాబాద్ సభలో కేసీఆర్ ఆర్టీసీ ని విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ యాదవ్, పూవ్వడా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించిన ఆయన .. ఆర్టీసీ సమ్మె ,సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యమకారుడు కేకే మధ్యవర్తిత్వం వహించాలని కోరారు.  టీఎన్జీవో,ఎన్జీవో  నేతలు ముఖ్యమంత్రి తో భేటీ అవ్వడం తప్పులేదన్నారు. కానీ  ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు  ఆర్టీసీ జేఏసీకి  మద్దతు ఇవ్వకుండా సీఎం తో సమావేశం అవ్వడం  బాధకర విషయమన్నారు.  శ్రీనివాస్ రెడ్డి చనిపోవడం వల్ల తాము tngo, tgo  కలవలేకపోయామని, త్వరలో  వారితో చర్చలు జరుపుతామని సూచించారు. ఎవరి ప్రలోభాలకు లొంగలేదని స్పష్టం చేశారు.