IPL 2024: ఇచ్చి పడేశాడుగా: రూసోకు కోహ్లీ దిమ్మతిరిగే కౌంటర్

IPL 2024: ఇచ్చి పడేశాడుగా: రూసోకు కోహ్లీ దిమ్మతిరిగే కౌంటర్

మైదానంలో కోహ్లీ ఎంత అగ్రెస్సివ్ గా ఉంటాడో ప్రత్యేకమా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే విరాట్.. సహచర ప్లేయర్లను ప్రోత్సహిస్తుంటాడు. కొన్ని సార్లు ప్రత్యర్థి ఆటగాళ్లు ఏమైనా అంటే బ్యాట్ తో పాటు నోటితో సమాధానం చెప్పడం ఇప్పటికే చాలా సార్లు చూసాం. ప్రత్యర్థి ఆటగాళ్లు కవ్విస్తేనే కోహ్లీ రెచ్చిపోతాడు అని మన అందరికీ  తెలిసిన విషయమే. అదే విధంగా సహచర ఆటగాళ్లను ఏమైనా అంటే విరాట్ ఇచ్చి పడేస్తాడు. తాజాగా ఐపీఎల్ లో అలాంటి సంఘటనే జరిగింది.

ఐపీఎల్ లో భాగంగా నిన్న (మే 9) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొత్తం కోహ్లీ హైలెట్ గా నిలిచాడు. మొదట బ్యాటింగ్ లో 92 పరుగులు చేసిన కింగ్..సూపర్ ఫీల్డింగ్ తో శశాంక్ రనౌట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఇక ఈ మ్యాచ్ లో 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ను రిలీ రూసో మెరుపు బ్యాటింగ్‌తో ముందుకు తీసుకెళ్లాడు. పవర్ ప్లే లో పవర్ హిట్టింగ్ తో జట్టు స్కోర్ ను శర వేగంతో ముందుకు తీసుకెళ్లాడు.ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నరూసో సెలెబ్రేషన్స్ వైరల్ గా మారాయి. 
    
డగౌడ్ వైపు సైగలు చేస్తూ మోకాళ్లపై నిల్చుని గన్ షాట్ కొట్టినట్లుగా రూసో ఫొజులు ఇచ్చాడు. హాఫ్ సెంచరీ వెంటనే రూసో  ఔటయ్యాడు.ఈ దశలో మన కింగ్ కోహ్లీ రెచ్చిపోయాడు. తరిగిచ్చేయడం కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. అతడి తరహాలోనే రూసోకు బదులు ఇచ్చేశాడు. గన్ షాట్ ఫొజులు ఇస్తూ తన సెలెబ్రేషన్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 60 పరుగుల తేడాతో పంజాబ్ పై గెలిచి బెంగళూరు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.