ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అడవిలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. 

ఎన్‌కౌంటర్ స్థలం నుంచిఇప్పటివరకు ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. 

గత కొన్ని నెలలుగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది..ఏప్రిల్ 16న రాష్ట్రంలోని కంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు 29 మంది మావోయిస్టులు చనిపోయారు. లొంగి పోవాలని, పునరావాసం కల్పిస్తమని ప్రభుత్వం చేస్తున్న విజ్ణప్తుతో కొంతమంది మావోయిస్టులు లొంగిపోయారు.