హైదరాబాద్‌సిటీ, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో ప్రత్యేక ప్యాసింజర్ వెయిటింగ్ లాంజ్‌ను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. విమానాశ్రయం వద్ద ఉన్న పిల్లర్ నెం. 9 సమీపంలో ఏర్పాటు చేసిన ఈ లాంజ్‌ను సోమవారం ప్రారంభించారు.
ఎయిర్పోర్ట్ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉండేలా ఇక్కడ అన్ని సౌకర్యాలను కల్పించారు. నేరుగా టికెట్లు కొనుగోలు చేసేందుకు, ఆన్లైన్ బుకింగ్ వివరాలు తెలుసుకునేందుకు, బస్సుల సమాచారం కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు గ్రేటర్ జోన్ ఈడీ రాజశేఖర్ తెలిపారు.
