- ఆర్టీసీ నియామకాలు పోలీస్‌శాఖ చేపట్టడం అన్యాయం: బక్క జడ్సన్
పంజాగుట్ట, వెలుగు: ఆర్టీసీ శ్రామిక్ నియామకాల్లో పాత పద్ధతినే అవలంబించాలని సామాజిక ఉద్యమకారుడు బక్క జడ్సన్డిమాండ్ చేశారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్ షిప్చేసిన అభ్యర్థుల ఆవేదన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజారై మాట్లాడారు. వీరు అతి తక్కువ గౌరవ వేతనానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోల్లో పని చేశారననారు. అప్రెంటిస్షిప్పూర్తయ్యాక రెగ్యులర్ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా.. ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు.
గతంలో ఆర్టీసీ నియామకాలు ఆ సంస్థ ద్వారానే జరిగాయని, ప్రస్తుతం పోలీస్‌శాఖ చేపట్టడం వల్ల పాత అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కల్పించుకుని ఆర్టీసీ ద్వారానే నియామక ప్రక్రియను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాజీవ్, మంగీలాల్, విజయ్, సామేల్, ఎల్లారావు, నాగరాజు, సయ్యద్ గౌసొద్దీన్తదితరులు పాల్గొన్నారు.
