ప్రభుత్వ గడువు బేఖాతరు: అర్థరాత్రి సంబరాలు చేసుకున్న కార్మికులు

ప్రభుత్వ గడువు బేఖాతరు: అర్థరాత్రి  సంబరాలు చేసుకున్న కార్మికులు

ఆర్టీసీ సమ్మె 33వ రోజుకు  చేరింది. విధుల్లో  చేరాలంటూ  ప్రభుత్వం పెట్టిన  గడువును  బేఖాతరు చేసిన  కార్మికులు నిరసలు, ఆందోళనలు  కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్    డెడ్ లైన్ పట్ల  పెద్దగా స్పందన  లేకపోవడంతో  కరీంనగర్ రీజియన్ లో  కార్మికులు అర్థరాత్రి  సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వ  తీరుకు వ్యతిరేకంగా నినాదాలు  చేశారు.  జగిత్యాల బస్ డిపో  ఎదుట కార్మికులు, అఖిల పక్ష  కార్మికులు  ధర్నాకు దిగారు. డిపో నుంచి  బస్సులు బయటకు రాకుండా  అడ్డుకున్నారు. దీంతో  కార్మికులను, అఖిలపక్ష  నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

కరీంనగర్,  మహబూబ్ నగర్ లో ….నిన్న అర్ధరాత్రి 12 గంటల  తర్వాత… డిపో ముందు  పెద్దసంఖ్యలో  కార్మికులు ప్రదర్శన  చేశారు. కార్మికుల  ఐక్యత  వర్ధిల్లాలి అంటూ  సంబరాలు చేసుకున్నారు.  తమ ఐక్యతే  తమ బలం  అనీ.. ప్రభుత్వం  చర్చలతో సమస్య  పరిష్కరించాలని..  ఆర్టీసీ   ప్రైవేటుపరం  చేయొద్దని  డిమాండ్ చేశారు.