సీఎం ఇంటి వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసన

సీఎం ఇంటి వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసన
  • మా సమస్యలు పరిష్కరించండి
     

హైదరాబాద్,వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్ర న్యాయం జరిగిందని, కాంగ్రెస్ సర్కార్ మాకు న్యాయం చేయాలని ఆర్టీసీ కార్మికులు కోరారు. బుధవారం జూబ్లీహిల్స్​లోని సీఎం రేవంత్ రెడ్డి  ఇంటి వద్దకు సుమారు 50 మంది కార్మికులు వెళ్లి నిరసన తెలిపారు.  కార్మికులు మాట్లాడుతూ ఆర్టీసీ అధికారులు చిన్న కారణాలతో సస్పెండ్ , మెమో, జీతాలు కట్ చేయడమే కాకుండా ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.  జాబ్​లు లేక కుటుంబాలు పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.  అనంతరం  ముగ్గురు ప్రతినిధులను పోలీసులు లోపలికి అనుమతించడంతో సీఎం పీఏకు వినతిపత్రం అందజేశారు.