
ఆర్టీసీ సమ్మె 22వ రోజుకు చేరింది. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతు సమ్మె చేస్తున్నారు. సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మికులు వారి ఆందోళనల్ని మరింత ఉదృతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
ఇవాళ కార్మికుల పిల్లలతో రెండు గంటల పాటు దీక్ష చేయనున్నారు జేఏసీ నేతలు. రేపు జిల్లాల్లో కలెక్టర్లకు సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం ఇవ్వనున్నారు. నిన్న TMU కార్యాలయంలో సమావేశమయ్యారు JAC నేతలు. సీఎం కామెంట్స్…భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు.