ISSలోకి పోని రోబో..మళ్లీ ప్రయత్నిస్తామన్నరష్యా

ISSలోకి పోని రోబో..మళ్లీ ప్రయత్నిస్తామన్నరష్యా

ఇంటర్నేషనల్‌‌ స్పేస్‌‌ స్టేషన్‌‌కు రష్యా పంపిన తొలి హ్యూమనాయిడ్‌‌ రోబో.. స్టేషన్‌‌లోకి వెళ్లలేకపోయింది. సైంటిస్టులు చాలా ప్రయత్నించినా ఐఎస్‌‌ఎస్‌‌లోకి రోబో చేరలేదని అక్కడి మీడియా శనివారం వెల్లడించింది. మరోసారి ప్రయత్నించేందుకు సైంటిస్టులు టైమ్‌‌ సెట్‌‌ చేశారు. ఆస్ట్రొనాట్లకు ఎలా హెల్ప్‌‌ చేయాలో ఐఎస్‌‌ఎస్‌‌లోని వ్యోమగాముల నుంచి ఫెడార్‌‌ నేర్చుకోవాల్సి ఉంది. బాటిల్‌‌ మూత తీయడం లాంటి చిన్న చిన్న పనులను తక్కువ గ్రావిటీలో రోబో చేసేలా డిజైన్‌‌ చేశారు. గురువారం కజకిస్థాన్‌‌లోని బైకనూర్‌‌ కాస్మొడ్రోమ్‌‌ నుంచి సుయజ్‌‌ ఎంఎస్‌‌ 14 రాకెట్‌‌ ద్వారా ఫెడార్‌‌ను స్పేస్‌‌లోకి పంపారు. సాధారణంగా సూయజ్‌‌లలో మనుషులు వెళ్తుంటారు. తొలిసారి మనుషులు లేకుండా రోబోను పంపారు. మనుషుల్లానే ఫెడార్‌‌కు కూడా రాకెట్‌‌లో స్పెషల్‌‌ పైలెట్‌‌ సీటు ఏర్పాటు చేశారు. రోబో బరువు 160 కిలోలు.  ఎత్తు 1.8 మీటర్లు.