RVNL Recruitment 2025 : మాస్టర్ డిగ్రీతో మేనేజర్ పోస్టులు..జీతం లక్షా 20 వేలు

RVNL Recruitment 2025 : మాస్టర్ డిగ్రీతో మేనేజర్ పోస్టులు..జీతం లక్షా 20 వేలు

రైల్ వికాస్ నిగమ్​ లిమిటెడ్(ఆర్ వీఎన్ఎల్) మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 03.
పోస్టులు: మేనేజర్/ సీఎస్ఆర్
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సోషల్ వర్కులో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 2025, జులై 3 నాటికి 40 ఏండ్లు ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా. చిరునామా డిస్పాచ్ సెక్షన్, గ్రౌండ్ ఫ్లోర్, ఆగస్టు క్రాంతి భవన్, భికాజి కామా ప్లేస్, ఆర్.కె.పురం, న్యూఢిల్లీ 110066.
లాస్ట్ డేట్: జులై 03.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.