
ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి మహారాష్ట్రలోని ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్ వే కార్పొరేషన్ లిమిటెడ్ అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 04.
పోస్టుల సంఖ్య: 18
పోస్టులు: ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్(సివిల్) 10, ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) 04, ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ (ఎస్ అండ్ టీ) 03,ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్(లోకో/ మెకానికల్) 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు గేట్ స్కోర్, పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 32 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: జులై 04.
జీతం: 54 వేలు