- బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్
ముషీరాబాద్, వెలుగు: ఎంబీసీ కులాలను ఆర్థిక ప్రగతి వైపు నడిపించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని బీసీ సంక్షేమ సంఘం నేషనల్వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ అన్నారు. ఇందుకోసం రూ.2 వేల కోట్ల చొప్పున కేటాయించాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని విద్యానగర్ బీసీ భవన్ లో సంఘం జాతీయ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
సంఘం జాతీయ కార్యదర్శిగా డాక్టర్ పి.చంద్రశేఖర్ కు నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. యువతలో ఉన్న నైపుణ్యాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోకపోవడం వల్లే నిరుద్యోగం పెరిగిందని ఆరోపించారు. ఎంబీసీ యువత చదువు, ఉద్యోగంతోపాటు రాజకీయ రంగంలో రాణించాలని ఆకాంక్షించారు. బీసీ నాయకులు పగిళ్ల సతీశ్, రాజేందర్, అనంతయ్య, జిల్లపల్లి అంజి, నీల వెంకటేశ్, చరణ్, రవి, యశ్వంత్ యాదవ్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
