
పబ్ జీ కా బాప్ అంటున్న ఫ్యాన్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా సృష్టిస్తున్న వైబ్రేషన్స్ మామూలుగా లేవు. టీజర్లు… పోస్టర్లు.. సాంగ్ రివీల్స్… తో ఇప్పటికే ఇండస్ట్రీలో సాహో ఫీవర్ నడుస్తోంది. సరిగ్గా నెలరోజుల తర్వాత విడుదల కాబోతున్న సాహో సినిమా గురించి లేటెస్ట్ గా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. అదే సాహో గేమ్.
సాహో అనేది ఓ సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా. భారీ అడ్వెంచరస్ మూవీ. ఓ సూపర్ హీరో ఉన్న మూవీ. చాలామంది విలన్లున్న సెల్యూలాయిడ్ క్రియేషన్.
ఓ నగరాన్ని ఆక్రమించేందుకు కొందరు విలన్ల ముఠా ప్రయత్నిస్తుంది. వాళ్ల శక్తులు.. వాళ్ల దగ్గరున్న పవర్స్ వినడానికి కూడా వింతగా ఉంటాయి. అలాంటి పవర్ ఫుల్ విలన్ల ఆటకట్టించేందుకు ఒకే ఒక్క హీరో రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది… ఆ హీరో దగ్గర ఎన్ని పవర్స్ ఉండాలి.. బాంబులు పెట్టొచ్చు.. బుల్లెట్లు పేల్చొచ్చు.. అమాంతం గాల్లోకి ఎగిరిపోయే జెట్ ప్యాక్ ఉండొచ్చు… భారీ కాయుడు కూడా అయ్యుండాలి.. అలా… ఓ సూపర్ హీరోకే బాప్ అయ్యే లక్షణాలున్న హీరోయిక్ కథతో సాహో సినిమా రూపొందుతోంది. అలాంటి హీరో సాహసాలను తెరపై చూస్తే అమేజింగ్ గా ఉంటుందని… ఇన్ని సూపర్ పవర్లున్న గేమ్ మరింత అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఆగస్ట్ 31న విడుదల కానున్న సాహో మూవీ గేమ్ ను అతి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నామని చిత్రయూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. యాక్టివేటింగ్ జెట్ ప్యాక్ క్యాప్షన్ తో ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
గేమ్ లుక్ అదుర్స్…
ప్రభాస్ జెట్ ప్యాక్ వేసుకుని..ఓ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకిన సీన్ అప్పుడెప్పుడో బాహుబలి2 రిలీజ్ టైమ్ లో… ఫస్ట్ టీజర్ లో చూపించారు. దాంతో… సాహో సినిమాపై అంచనాలు స్కై హైకి చేరిపోయాయి. ఇప్పుడు అదే కాస్ట్యూమ్ లో స్పెక్ట్స్ పెట్టుకుని ఉన్న ఫొటో రిలీజ్ చేశారు. అందులోనే ఎనిమీస్ కనిపిస్తుంటారు. పిక్ మాత్రం అదుర్స్ అంటోంది సోషల్ మీడియా.
మూవీ గేమ్స్ ఈ మధ్య క్లిక్ కాలేదు
తెలుగు సినిమాకు సంబంధించి.. అప్పుడెప్పుడో బాహుబలి సీజన్ లో సినిమా బేస్డ్ ఆన్ లైన్ గేమ్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ లో బడా హీరోల సినిమాలకు ఒకట్రెండు గేమ్స్ రిలీజ్ చేశారు. ఐతే.. అవేవీ పెద్దగా క్లిక్ కాలేదు. గేమ్ ఎన్విరాన్ మెంట్ బాగుండి.. మల్టీ ప్లేయర్ ఆప్షన్ ఉంటే…. అదిరిపోయే యాక్షన్ ఉంటే.. సాహో గేమ్.. పబ్ జీ ని మించిపోవడం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు. అప్పుడే సోషల్ మీడియాలో సాహో గేమ్ ప్రొఫైల్ ఫొటో వైరల్ అయిపోయింది.