సచిన్ ఎంపిక చేసిన బెస్ట్ టీమ్ ఇదీ.. ధోనీ లేడు

సచిన్ ఎంపిక చేసిన బెస్ట్ టీమ్ ఇదీ.. ధోనీ లేడు

వరల్డ్ కప్ 2019 మెగాటోర్నీ ముగియడంతో… దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన ఫేవరిట్ జట్టును ఎంపిక చేశాడు. ప్రపంచకప్ లో అద్భుత ప్రతిభ చూపించిన వారినుంచి సచిన్ 11 మందిని ఎంపిక చేసి.. తన జట్టులో చోటుకల్పించాడు. హెవీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ.. సచిన్ టీమ్ లో ఐదుగురు భారతీయ ప్లేయర్లకు చాన్స్ దక్కింది. ఐతే.. ఈ జట్టులో టీమిండియా దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీకి చోటు దక్కలేదు. రవీంద్ర జడేజా ఆడింది 2 మ్యాచ్ లే కానీ.. అతడి ప్రతిభ ఆధారంగా సచిన్ తన జట్టులోకి ఆల్ రౌండర్ గా తీసుకున్నాడు.

‘టెండూల్కర్ 2019 క్రికెట్ వరల్డ్ కప్ ఎలెవన్’ జట్టుకు కెప్టెన్ గా న్యూజీలాండ్ స్కిప్పర్ కేన్ విలియంసన్ ఎంపిక చేశాడు మాస్టర్ బ్లాస్టర్.  రోహిత్ శర్మ(ఇండియా), జానీ బెయిర్ స్టో(ఇంగ్లండ్-వికెట్ కీపర్)లను ఓపెనర్స్ గా ఎంపిక చేశాడు. కేన్ విలియంసన్, విరాట్ కోహ్లీ (ఇండియా)లను మిడిలార్డర్ లో ప్లేస్ చేశాడు. షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్), బెన్ స్టోక్స్(ఇంగ్లండ్), హార్దిక్ పాండ్యా(ఇండియా), రవీంద్రజడేజా(ఇండియా)లకు ఆల్ రౌండర్ల కోటాలో ప్లేస్ ఇచ్చాడు సచిన్. మిషెల్ స్టార్క్(ఆస్ట్రేలియా), జస్ ప్రీత్ బుమ్రా(ఇండియా), జోఫ్రా ఆర్చర్(ఇంగ్లండ్)లను బౌలర్లుగా పిక్ చేశాడు సచిన్ టెండూల్కర్.

అలా.. తన వరల్డ్ కప్ టీమ్ ను ప్రకటించాడు టెండూల్కర్. రోహిత్ శర్మ, కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జడేజా, బుమ్రాలకు ఇండియా నుంచి స్థానం కల్పించాడు సచిన్.

సచిన్ టీమ్ లో… ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ విలియంసన్, ప్లేయర్ ఆఫ్ ఫైనల్ స్టోక్స్, హయ్యెస్ట్ వికెట్ టేకర్ స్టార్క్, హయ్యెస్ట్ రన్ స్కోరర్ రోహిత్ శర్మ లకు స్థానం దక్కింది.