పెంపుడు కుక్కలతో సచిన్ ఆటలు

పెంపుడు కుక్కలతో సచిన్ ఆటలు

హీరో, హీరోయిన్లే కాదు క్రికెటర్లు ఏం చేసినా వారి అభిమానులకు ఎంతో ఆనందం వేస్తుంది. సాధారణంగా మనకి ఇష్టమైన వ్యక్తుల విషయాలను తెలుసుకోవడానికి ఆరాటపడుతూ ఉంటాం. ఎప్పటికప్పుడు వాళ్లను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటాం. తాజాగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ తన రెండు పెంపుడు కుక్కలతో సరదాగా ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఇంటి గార్డెన్‭లో పెంపుడు కుక్కలతో సరదాగా గడిపారు. అందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. ఈ రెండు ఇంట్లో లేకపోతే  అది ఇల్లులా ఉండదంటూ క్యాప్షన్ పెట్టారు. సాధారణంగా పెంపుడు కుక్కలంటే ఇష్టపడని వారుండరు. పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కాసేపు వాటితో సమయం గడిపితే చాలు ఎక్కడి లేని ఆనందం వచ్చేస్తుంది. ఇక సచిన్ పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న వీడియో చూసి నెటిజన్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.