గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హైదరాబాదీ కుర్రాడు

గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హైదరాబాదీ కుర్రాడు

కొత్త సంవత్సరం వేళ హైదరాబాదీ కుర్రాడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఫాస్ట్‌గా సైడ్ లంజెస్ తీయడంలో ఈ రికార్డు నమోదయింది. హైదరాబాద్‌కు చెందిన సాయి దీపక్ ఎక్కువగా వ్యాయామంపై శ్రద్ధ చూపుతుంటాడు. ఆయన ఒక నిమిషంలో 59 లంజెస్ తీసి ఈ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు పాకిస్తాన్‌కు చెందిన ఇర్ఫాన్ మసూద్ పేరున ఈ రికార్డు ఉండేది. ఆయన ఒక నిమిషంలో 54 లంజెస్ తీసి గిన్నీస్ రికార్డులో పేరు నమోదు చేసుకున్నాడు. ఇర్ఫాన్ రికార్డును బ్రేక్ చేసి సాయి దీపక్ గిన్నీస్ రికార్డులో తన పేరు లిఖించుకున్నాడు. గిన్నీస్ రికార్డులోకెక్కడం సాయి దీపక్‌కి ఇది మొదటిసారి కాదు. అంతకుముందే ఆయన పేరుపై మూడు గిన్నీస్ రికార్డులు ఉన్నాయి. ఒక నిమిషంలో ఎక్కువ లంజెస్ తీయడానికి రెండు నెలలుగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు దీపక్ చెప్పాడు.