ఫేక్ వెడ్డింగ్ రూమర్స్‌పై.. సాయి పల్లవి మాస్ వార్నింగ్

ఫేక్ వెడ్డింగ్ రూమర్స్‌పై.. సాయి పల్లవి మాస్ వార్నింగ్

సహజ నటి సాయిపల్లవి(Sai Pallavi)కి పెళ్లి జరిగిందంటూ రెండు రోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది. సాయి పల్లవికి పెళ్లి అయ్యిందని.. అవునా అని ఆశ్చర్యపోయేలోపు పెళ్లి ఫొటోలు ఇదిగో అంటూ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన ఎవరికైనా..నిజంగానే సాయి పల్లవి పెళ్లి చేసుకున్నది అని కన్ఫామ్ అవుతారు.. ఇందులో నిజం ఏంటంటే..సాయి పల్లవి పెళ్లి చేసుకోలేదు.

లేటెస్ట్ గా ఇదే విషయం పై సాయి పల్లవి ట్వీట్ చేశారు "నిజం చెప్పాలంటే నేను రూమర్స్ ని పెద్దగా పట్టించుకోను. కానీ కుటుంబ సభ్యులు,స్నేహితుల జోలికొస్తే నేను మాట్లాడాలి. నా సినిమా పూజా కార్యక్రమం నుంచి..ఒక ఫోటోను ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసి పెయిడ్ బోట్స్‌తో ప్రచారం చేయడం చాలా అసౌకర్యంగా పని.

నా సినిమాలకు సంబంధించిన మంచి అప్డేట్స్ పంచుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి పనికిమాలిన విషయాలపై స్పందించడం నిజంగా బాధంగా ఉంది.  ఒక వ్యక్తికి ఇలాంటి ఇబ్బందిని కలిగించడం నిజంగా నీచమైన పనే”అంటూ తన ట్విట్టర్లో సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అసలు ఏం జరిగిందంటే.. 

సాయి పల్లవి లేటెస్టుగా తమిళ యాక్టర్ శివ కార్తికేయన్ (SK21) కొత్త మూవీలో నటిస్తుంది. ఆ సినిమా ప్రారంభోత్సవంలో..దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామితో కలిసి పూజలో పాల్గొన్నది సాయి పల్లివి. ఆ సందర్భంగా పూజారులు వాళ్లకు దండలు వేసి.. క్లాప్ కొట్టటంతోపాటు.. స్క్రిప్ట్ బుక్ అందించారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ఫొటోలు తీసింది. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దర్శకుడు రాజ్ కుమార్ పరియసామి తన ఎక్స్ అకౌంట్ నుంచి ఈ ఫొటోలు బయటకు వచ్చాయి. 

ఇక్కడే సోషల్ మీడియా వాళ్లు తమ టాలెంట్ చూపించేశారు. సాయి పల్లివి..డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ఉన్న దండలతో.. పక్కపక్కనే ఉన్న ఫొటోను.. కట్ చేశారు. ఫుల్ ఫొటోను.. హాఫ్ చేశారు. వాటిని రీ పోస్టు చేస్తూ.. సాయి పల్లవి పెళ్లి అయిపోయింది..వరుడు ఇతనే.. లవ్ మ్యారేజ్ అంటూ హోరెత్తించారు. దీంతో సినీ ఇండస్ట్రీతోపాటు..అభిమానుల్లో ఆతృత, ఆరా పెరిగింది.

విరాట పర్వం, గార్గి మూవీస్ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సాయి పల్లవి..ఇక ప్రస్తుతం నాగ చైతన్య(Naga Chaitanya)..చందూ మొండేటి(Chandoo Mondeti) కాంబోలో ఒక మూవీ, శివ కార్తెకేయన్ తో మరో మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.