గుంటూరు కారం నుంచి మరో లీక్..

గుంటూరు కారం నుంచి మరో లీక్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu), త్రివిక్రమ్(Trivikram) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur kaaram). హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Harika hasini creations) పై చినబాబు(Chinababu), సూర్యదేవర నాగవంశీ(Suryadevara nagavanshi) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో.. శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి(Meenakshi chaudary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చాలా రోజుల తరువాత ,మహేష్ బాబు నుండి వస్తున్న పక్కా మాస్ అండ్ కమర్షియల్ సినిమా కావడంతో.. ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.

లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ఫోటో ఒకటి లీక్ అయ్యింది. షూటింగ్ చేస్తున్న సమయంలోని ఓ కత్తి ఫైట్ సీన్కు సంబందఙంచిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని ఫొటోలు, వీడియోలు సహా ఒక సాంగ్ కూడా లీక్ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రొడక్షన్ హౌస్ హారిక-హాసిని బ్యానర్ వెంటనే ఎలర్ట్ అయింది. ఇక ఈ మూవీ నుంచి మరిన్ని లీకులు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఊహించని విధంగా మహేష్ బాబు స్టిల్స్ లీక్ అవ్వడంపై ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారు.

ఇక రీసెంట్గా ప్రభాస్ కల్కి, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌ మూవీస్ ప్రొడ్యూసర్స్ లీక్ లు  చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవంటూ కాపీరైట్ నోటీసులు ఇచ్చారు. ఈ ప్రొడ్యూసర్స్ తరహాలోనే..గుంటూరు కారం నిర్మాత చినబాబు కూడా..బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజైన స్పెషల్ మాస్ స్ట్రైక్ ఫ్యాన్స్ ను వీపరీతంగా ఆకట్టుకుంటోంది. గుంటూరు కారం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.