ఎట్టకేలకు OTTలోకి ఏజెంట్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

ఎట్టకేలకు OTTలోకి ఏజెంట్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

అక్కినేని అఖిల్(Akkineni Akhil) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఏజెంట్(Agent). టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surendar reddy) తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ సినిమా మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేక టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది. 

ఈ సినిమా విడుదలై దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా.. ఓటీటీలోకి మాత్రం రాలేదు. అయితే తాజాగా అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను సోను లీవ్ సంస్థ తీసుకున్న విషయం తెల్సిందే. దీంతో ఈ సినిమాను సెప్టెంబర్ 29 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్నవాళ్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 

ఇక ఏజెంట్ సినిమా విషయానికి వస్తే.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందించారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హిప్ హాఫ్ తమిళ సంగీతం అందించగా.. అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించారు. మరి థియేటర్ లో డిజాస్టర్ అయిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.